Andhra Pradesh : జగన్ తాత దిగి వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరు : చింతమనేని ప్రభాకర్

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలేదని జగన్ జాగీరుకే పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు నా షర్టు చింపేశారని..పోలీసులు ఉన్నది అందుకేనా? టీడీపీ ఏ కార్యక్రమం చేసినా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారని జగన్ తాత దిగి వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరు అంటూ చింతమనేని మండిపడ్డారు.

Andhra Pradesh : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలేదని జగన్ జాగీరుకే పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు నా షర్టు చింపేశారని..పోలీసులు ఉన్నది అందుకేనా? టీడీపీ ఏ కార్యక్రమం చేసినా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారని జగన్ తాత దిగి వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరు అంటూ చింతమనేని మండిపడ్డారు. మేమేన్నా తప్పులు చేస్తే చర్యలు తీసుకోండి అంతేగానీ టీడీపీ నేతల కనిపిస్తే చాలు వెర్రెత్తిపోయి ఇలా వ్యవహరించట సరికాదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు. నాపై ఇప్పటి వరకు 31 కేసులు పెట్టారు. నా షర్టు చింపేశారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రేపు పోలీసులకు కూడా ఇదే గతి పడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Pawan kalyan-Chegondi harirama jogaiah: చేగొండి హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్.. ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని డిమాండ్

పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగిన చింతమనేని ప్రభాకర్ చిరిగిన చొక్కాతోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. చిరిగిపోయిన తన చొక్కాను మీడియాకు చూపించారు. ఏం తప్పు చేశానని పోలీసులు నా చొక్కా చించేశారు? అంటూ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి… అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు. తనపై ఇప్పటికే 31 కేసులు పెట్టారని..అయినా భయపడేది లేదన్నారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు.

కాగా మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టగా ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ఆస్పత్రిలో కూడా చేగొండి దీక్షను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో చేగొండి హరిరామ జోగయ్యను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చింతమనేని కూడా హాస్పిటల్ వద్ద ధర్నా చేపట్టారు. హరిరామ జోగయ్యను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చింతమనేనిని బలవంతంగా అరెస్ట్ చేసి జీపు ఎక్కించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు