Pawan kalyan-Chegondi harirama jogaiah: చేగొండి హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్.. ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని డిమాండ్

Pawan kalyan-Chegondi harirama jogaiah: చేగొండి  హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్.. ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని డిమాండ్

pawan kalyan demands jagan govement to react on chegondi harirama jogaiah deeksha

pawan kalyan-chegondi harirama jogaiah : మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టగా ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ఆస్పత్రిలో కూడా చేగొండి దీక్షను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో చేగొండి హరిరామ జోగయ్యకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

కాపు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలంటూ ఏలూరు ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న చేగొండి హరిరామజోగయ్యకు పరామర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని ఫోన్ లో పరామర్శించారు. చేగొండి హరిరామజోగయ్య గారి దీక్షపై ప్రభుత్వం స్పందించాఅని ఆయనతో చర్చలు జరపాలని పవన్ డిమాండ్ చేశారు. చేగొండిని పరామర్శించటానికి జనసేన నేతలు ఏలూరు జీజీహెచ్చకు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. హరిరామజోగయ్య కుమారుడు కూడా తండ్రి వద్దకు రాగా పోలీసులకు ఆయనను కూడా అడ్డుకున్నారు.

అలాగే టీడీపీ నేతలు కూడా చేగొండి హరిరామ జోగయ్యను పరామర్శించాటానికి..ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని హాస్పిటల్ వద్ద ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. చింతమనేనిని అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులపై టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి వాతావరణంతో ఏలూరులోని జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్పటల్ వద్దకు ఎవరు వచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారు.

 

deeksha