టీడీపీలో చేరేందుకు సిద్ధం? కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ ఆసుపత్రిపై రాళ్ల దాడి

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును విమర్శించిన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌ను టీడీపీలోకి ఎలా తీసుకుంటారని..

టీడీపీలో చేరేందుకు సిద్ధం? కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ ఆసుపత్రిపై రాళ్ల దాడి

TDP-YCP

Updated On : July 11, 2024 / 1:57 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌, వైసీపీ నేత డాక్టర్‌ సుధీర్‌కు చెందిన ఆసుపత్రిపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆసుపత్రి అద్దాలు పగిలిపోయాయి. వైసీపీ నుంచి సుధీర్ టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును విమర్శించిన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌ను టీడీపీలోకి ఎలా తీసుకుంటారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో సుధీర్ ప్రియా నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. ఆసుపత్రి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళనకు దిగడంతో అక్కడ పోలీసులు చేరుకున్నారు.

కాగా, సుధీర్‌ కొందరు కౌన్సిలర్లతో కలిసి అమరావతికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. టీడీపీ నుంచి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. అప్పట్లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా సుధీర్‌ ఎన్నికయ్యారు.

Also Read: వైసీపీ సస్పెన్షన్ వేటు వేయడంతో మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి కంటతడి.. ఏమన్నారో తెలుసా?