నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని విచారిస్తున్న సీఐడీ

కేంద్ర హోంశాఖకు ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ అధికారులు నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని హైదరాబాద్ లో విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై ప్రస్తుతం రాష్ట్రమంతా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ విషయంపై లేఖ అతను రాయలేదంటూ గతంలో విజయ సాయిరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం లేఖ ఎవరు రాశారన్న అంశంపై ఇప్పటికే సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిమ్మగడ్డ పీఎస్ గా ఉన్న సాంబమూర్తిని హైదరాబాద్ లో ఉన్నటువంటి సీఐడీ అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే లేఖ ఎక్కడి నుంచి రాశారు. ఆ లేఖను ప్రిపేర్ చేసిని వ్యక్తి ఐపీ అడ్రస్ కోసం ప్రస్తుతం సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు కేంద్రంకు పంపినటువంటి లేఖ నిమ్మగడ్డకు ఎవరు మెయిల్ ద్వారా పంపినట్టు సీఐడీ అధికారులు కొంత గుర్తించినట్లు సమాచారం. నిమ్మగడ్డను సైతం మరోసారి సీఐడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
అసలు లేఖను ఎవరు రాశారు? ఏ అడ్రస్ నుంచి? ఎక్కడి నుంచి? ఏ మెయిల్ ద్వారా కేంద్ర హోంశాఖకు ఈ లేఖ వెళ్లిందనే దానిపై ఒవరాల్ గా సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీఐడీ కార్యాలయంలో నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని దర్యాప్తు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అధికారులు దర్యాప్తు అంశాలను చాలా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు లేఖను స్వాధీనం చేసుకున్నట్లు కనబడుతుంది.