Cm Chandrababu Naidu : ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- విశాఖ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసే బాధ్యత ఎన్డీయే కూటమిది.

Cm Chandrababu Naidu : విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో అదిరిందని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.2లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామన్నారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని అన్నారాయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. దేశం మొత్తం మెచ్చే నాయకుడు నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కితాబిచ్చారు. విశాఖలో బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

”రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్డీయే గెలిచింది. 97శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాం. ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది. మహారాష్ట్ర, హరియానాలో ఎన్డీయేను గెలిపించారు. రేపు ఢిల్లీలోనూ ఎన్డీయే గెలవబోతోంది. పోలవరం కోసం ఏడు మండలాలను ఇచ్చి ప్రధాని మోదీ సహకరించారు. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని అని మరోసారి ఈ సభ ద్వారా తెలుపుతున్నా. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసే బాధ్యత ఎన్డీయే కూటమిది. సమస్యలు ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తాం.

Also Read : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్‌ బీర్లు బంద్.. ఎందుకంటే?

ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈ సభలో పాల్గొన్నారు. 5వేల మంది పోలీసులతో ఈ సభకు భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Also Read : బలమైన భారత్ కోసం కృషి చేస్తున్నారు- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం