King fisher Beers : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్‌ బీర్లు బంద్.. ఎందుకంటే?

King fisher Beers : 2024 ఏప్రిల్, అక్టోబరులో 302.84 లక్షల బీర్లు అమ్ముడై, దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

King fisher Beers : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్‌ బీర్లు బంద్.. ఎందుకంటే?

United Breweries beer supply to Telangana

Updated On : January 8, 2025 / 5:35 PM IST

King fisher Beers : సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి బీర్లు లభించకపోవచ్చు . రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హింకెన్ బీర్లు అమ్మకాలను యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ నిలిపివేసింది. ఈ మేరకు బీర్ల కంపెనీలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కింగ్‌ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్‌ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ నిర్ణయానికి రెండు ప్రాథమిక కారణాలను పేర్కొంది.

Read Also : Formual E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ, ఈడీ ప్రశ్నల వర్షం

నిలిచిపోయిన ధర : టీజీబీసీఎల్ (TGBCL) 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి యునైటెడ్ బ్రూవరీస్ బీర్ ప్రాథమిక ధరను సవరించలేదు. దాంతో రాష్ట్రంలో కంపెనీకి గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది.
చెల్లించని బకాయిలు : టీజీబీసీఎల్ ద్వారా గత బీర్ సరఫరాలకు సంబంధించి మీరిన చెల్లింపులు పరిష్కరించలేదు.

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బీర్ తయారీదారు అయిన హీనెకెన్ ఎన్వీ యూనిట్ యూపీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో.. “ఈ రెండు సమస్యల కారణంగా టీజీబీసీఎల్‌కి కింగ్ ఫిషర్ బీర్ నిరంతర సరఫరా ఆచరణీయంగా లేదు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాం” అని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.

తెలంగాణలో మద్యంపై టీజీబీసీఎల్ గుత్తాధిపత్యం :
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (TGBCL) రాష్ట్రంలో మద్యం టోకు, రిటైల్ విక్రయాలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ఈ వివాదం స్థిర ధర, ఆలస్యమైన చెల్లింపుల కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. యునైటెడ్ బ్రూవరీస్ ఈ సమస్యలను పరిష్కరించే వరకు బీర్ల సరఫరాను నిలిపివేయనుంది. ఈ సస్పెన్షన్ తెలంగాణలో బీర్ లభ్యతపై ప్రభావం చూపనుంది. తద్వారా మద్యం సరఫరా గొలుసుకు అంతరాయం కలిగించవచ్చు.

United Breweries halts beer supply to Telangana

King fisher Beers ( Image Source : Google )

రిటైలర్లు, వినియోగదారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పండుగలు లేదా సెలవులు వంటి అధిక డిమాండ్ ఉన్న రోజుల్లో బీర్ సరఫరా సస్పెన్షన్ రెండు సంస్థల ఆదాయాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇప్పటికే క్షీణించాయి. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల నాటికి బీఎస్ఈలో 4 శాతం పైగా షేర్లు పడిపోయి రూ.1,990.95కి చేరుకుంది. ఈ విషయంపై టీజీబీసీఎల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

బీర్ల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానం :
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) సర్వే ప్రకారం.. 2024 ఏప్రిల్, అక్టోబరు మధ్యకాలంలో 302.84 లక్షల బీర్లు అమ్ముడై, బీర్ విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

2024 డిసెంబర్‌లోనే తెలంగాణకు చెందిన టిప్పలర్లు రూ.3,523.21 కోట్ల విలువైన మద్యం సేవించారని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2023లో బీర్ అమ్మకాలు 4.62 మిలియన్ కేసులు, డిసెంబర్ 2022లో 3.95 కేసులతో పోలిస్తే.. డిసెంబర్ 2024లో 3.55 మిలియన్ కేసులు (మిలియన్ ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 4.25 మిలియన్ కేసుల బీర్ అమ్ముడయ్యాయి.

Read Also : Couple End Life : నాగ్‌పూర్‌లో దంపతుల ఆత్మహత్య.. పెళ్లి దుస్తుల్లోనే అర్ధరాత్రి కేక్ కట్ చేసి అనంతలోకాలకు..!