AP: ఏపీలో ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు.. పండుగ రోజు కీలక ఫైలుపై సంతకం

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

AP: ఏపీలో ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు.. పండుగ రోజు కీలక ఫైలుపై సంతకం

CM Chandrababu Naidu

Updated On : March 30, 2025 / 1:07 PM IST

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితోపాటు పలు శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

 

20ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాటవిని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అమెరికన్స్ కంటే రెండింతలు ఆదాయం సంపాదించిన జాతి తెలుగు జాతి అని.. ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఎన్డీయే ప్రభుత్వంలో నేను గానీ, పవన్ కల్యాణ్ గానీ, నరేంద్ర మోదీ గానీ ఈ దేశం బాగుండాలి.. రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు.

 

ఈ ఉగాది సందర్భంగా మిమ్మలను కోరుతున్నాను.. హార్డ్ వర్కు కాదు.. స్మార్ట్ వర్కు అవసరం. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏ సేవలు అయినా మీకు అందుబాటులోకి వచ్చాయి. సెల్ ఫోన్ ద్వారానే మేముకూడా ప్రజల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నా. మీ సెల్ పోన్ ను అడిగితే.. వ్యవసాయం, విద్య, ఇతర అంశాలకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు దొరుకుతున్నాయని చంద్రబాబు అన్నారు.

 

నేడు సంపద కొంతమందికే పరిమితం కాకూడదు. సంపద ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండాలి.. మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే పీ-4, జీరో పావర్టీ అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి భారతదేశ ప్రజలు ప్రపంచంలోనే ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంటారు. అందులో ముప్పై శాతం తెలుగువారు ఉండాలనేది నా ఆకాంక్ష.. దానికోసమే నేను పనిచేస్తున్నాను. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు నేను అందిపుచ్చుకున్నాను. పేదలను పైకితీసుకువచ్చేందుకు సంపన్నులు ముందుకు రావాలి. జీరో పావర్టీ ఆ తరువాత మెరుగైన జీవన ప్రమాణాలు, ఉన్నతమైన జీవన ప్రమాణాలు. ఇది నా జీవిత ఆశయం. దీనిని పూర్తిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలనేది నా సంకల్పం. ఇది జరిగితే నా జన్మ చరితార్ధం అవుతుందని భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పీ4 వంటి మంచి కార్యక్రమంకోసం అందరూ ముందుకు రావాలని కోరారు.

 

కీలక ఫైలుపై సంతకం..
ఉగాది రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి ఫైలుపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది.