Tirumala: నారా దేవాన్ష్‌లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే?
దేవాన్ష్ లా మీరూ అన్న ప్రసాదం ట్రస్ట్ కి విరాళం ఇవ్వొచ్చు. ఒక ఫుల్ డే కి ఎంత..? ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్న లంచ్, డిన్నర్ ఇలా దేనికిదానికి ప్రత్యేకంగా విరాళాలు డొనేట్ చేయొచ్చు.

Tirumala Annaprasadam Trust: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి, నారా దేవాన్ష్‌లు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కు రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఒక రోజంతా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దేవాన్ష్ పేరు మీద టీటీడీ అన్నప్రసాద వితరణ చేస్తుంది. విరాళం అందించిన అనంతరం అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి వారు అల్పాహారాన్ని స్వీకరించారు.
నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజంతా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దేవాన్ష్ పేరు మీద టీటీడీ అన్నప్రసాద వితరణ చేస్తుంది. దేవాన్ష్ లా మీరూ అన్న ప్రసాదం ట్రస్ట్ కి విరాళం ఇవ్వొచ్చు. ఒక ఫుల్ డే కి ఎంత..? ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్న లంచ్, డిన్నర్ ఇలా దేనికిదానికి ప్రత్యేకంగా విరాళాలు డొనేట్ చేయొచ్చు. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
మీరు ఫుల్ డే ( బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) కోసం అయితే, రూ.44లక్షలు విరాళంగా టీటీడీకి అందించాల్సి ఉంటుంది. కేవలం బ్రేక్ ఫాస్ట్ కోసం మాత్రమే అయితే రూ.10లక్షలు, కేవలం మధ్యాహ్న భోజనం (లంచ్) కోసం అయితే రూ.17లక్షలు, కేవలం డిన్నర్ కోసం అయితే రూ.17లక్షలు డొనేట్ చేయాల్సి ఉంటుంది. మనం కోరుకున్న రోజును కేటాయిస్తారు (అయితే, ఆరోజు వేరేవాళ్లు ఎవరూ రిజర్వ్ చేసుకోకపోతే). టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ పేరు మీద చెక్ లేదా డీడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు, సమయానికి దాత పేరుకూడా డిస్ ప్లే చేస్తారు.