కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ విందు : ఆంధ్రా, నార్త్, సౌత్ ఇండియన్ వంటకాలు

  • Published By: madhu ,Published On : December 15, 2019 / 10:00 AM IST
కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ విందు : ఆంధ్రా, నార్త్, సౌత్ ఇండియన్ వంటకాలు

Updated On : December 15, 2019 / 10:00 AM IST

ఏపీలోని కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.  విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు కమిషనర్‌లు కూడా హాజరు కానున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. 

* ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల పాటు సీఎం జగన్ గడుపుతారని తెలుస్తోంది. జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారని, వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడుగుతారని సమాచారం. 
* ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్‌ ఇండియన్ వంటలను వండి వడ్డిస్తారు.
* సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

* తాజాగా కలెక్టర్లు, ఎస్పీలతో విందు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
* ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా.. ప్రభుత్వం ఏ ప్రణాళికతో ముందుకు వెళుతుందనే విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. 
* ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకొనే ఛాన్స్ ఉంది. 
Read More : టిక్‌టాక్‌ మోజులో ఫ్యామిలీని వదిలేసిన మహిళ