CM Jagan : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. సంక్రాంతిలోగా
సంక్రాంతిలోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు ఇటీవలే మంత్రి బుగ్గన ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP CM Jagan
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ఎట్టకేలకు వచ్చేశాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ను ఆర్ధిక శాఖ జారీ చేసింది. ఎల్లుండి (డిసెంబర్ 15) నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు
సంక్రాంతిలోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు ఇటీవలే మంత్రి బుగ్గన ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
కాగా, నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా పలు పోస్టులు ఫిలప్ చేయనుంది ప్రభుత్వం. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది జగన్ సర్కార్.