AP Cabinet : తుది దశకు ఏపీ కేబినెట్‌ కసరత్తు.. సీఎం జగన్‌తో మరోసారి భేటి కానున్న సజ్జల

ఏపీ మంత్రివర్గంపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన సీఎం చివరి నిమిషం వరకు అన్ని అంశాలు లెక్కలు వేస్తున్నారు.

AP Cabinet : తుది దశకు ఏపీ కేబినెట్‌ కసరత్తు.. సీఎం జగన్‌తో మరోసారి భేటి కానున్న సజ్జల

Ap New Cabinet

Updated On : April 9, 2022 / 4:30 PM IST

AP cabinet CM Jagan : కొత్త వాళ్లెవరు.. పాత వాళ్లలో అవకాశం దక్కేదెవరికి.. ఏపీలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎల్లుండి మంత్రివర్గ పునర్వస్థీకరణ ఉండగా.. సోమవారం ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. సీఎం జగన్ తన కేబినెట్ కూర్పుపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రుల జాబితా తయారీలో జగన్ పూర్తిగా గోప్యత పాటిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్‌తో మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే మూడు గంటల పాటు వీరి మధ్య కేబినెట్ విషయంలో చర్చ జరిగింది. ఇప్పుడు జరిగే సమావేశంలో స్పష్టత వస్తే.. ఈరోజు లేదా రేపు రాజ్ భవన్‌కు కొత్త మంత్రుల జాబితాను పంపిస్తారు. అంతే కాకుండా.. కొత్త మంత్రులకు సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి కేబినెట్‌లో బెర్త్ కన్‌ఫామ్ అయిందనే విషయాన్ని చెప్పనున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet : ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

ఏపీ మంత్రివర్గంపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన సీఎం చివరి నిమిషం వరకు అన్ని అంశాలు లెక్కలు వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతిపదికన కసరత్తు సాగుతోంది. సీఎం జగన్‌తో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మూడు గంటలపాటు చర్చలు సాగాయి. నిన్న కూడా సజ్జలతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.