కరోనా అనుమానమా, ఈ 3 విషయాలు అందరికీ తెలిసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం

రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు కరోనా నిర్ధారణ టెస్టులు కూడా చేయడానికి ఇబ్బంది ఉండేదని, ఆ పరిస్థితి పోయిందని, ఇప్పుడు ఏకంగా రోజుకు సగటున 22 నుంచి 25వేల టెస్టులు చేయగలుగుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకూ 10లక్షలకుపైగా కరోనా టెస్టులు చేయగలిగామన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలు ఇవ్వాలి:
కరోనా ట్రీట్ మెంట్ విషయంలో హోం ఐసోలేషన్ అన్నది చాలా ముఖ్యమైన అంశం అవుతుందన్న సీఎం జగన్, 85శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయని తెలిపారు. కోవిడ్ సోకినట్టుగా ఎవరికైనా అనిపిస్తే.. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి కాల్ చేయాలి? అన్నదానిపై ప్రజలందరికీ తెలిసేలా చూడాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. క్వారంటైన్ సెంటర్స్ లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలన్నారు. సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవల మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ చెప్పారు. రోగులకు ఇచ్చే ఆహారం, బాత్‌రూం, బెడ్ల మీద దృష్టి పెట్టాలన్నారు. వైద్యుల పర్యవేక్షణ బాగుందా లేదా? మందులు ఇస్తున్నారా? లేదా? ఆ మందులను కూడా జీఎంపీ ప్రమాణాలు ఉన్నవి ఇస్తున్నారా? లేదా? అన్నదాని మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు.
సీఎం జగన్ కామెంట్స్:
* రెండు మూడు టెస్టులు కూడా చేయడానికి ఇబ్బంది ఉండేది. ఆ పరిస్థితి మారిపోయి ఏకంగా రోజుకు సగటున 22-25వేల టెస్టులు చేయగలుగుతున్నాం
* ఇప్పటివరకూ 10లక్షలకుపైగా టెస్టులు చేయగలిగాం
* అధికారులకు, కలెక్టర్లకు అభినందనలు
* హోం ఐసోలేషన్ అన్నది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది
* 85శాతం కేసులకు ఇంట్లోనే నయం అవుతుంది
* ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి
* హోం ఐసోలేషన్‌కు రెఫర్ చేసే వారిని బాగా చూసుకుంటున్నామా? లేదా? మందులు సరిగ్గా అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి
* గ్రామ సచివాలయంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్, ఆశావర్కర్, ఏఎన్‌ఎం, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్ కంట్రోల్ రూం బాగా పనిచేయాలి
* ఈ యంత్రాంగం మెరుగ్గా పనిచేయాలి
* హోం ఐసోలేషన్ మీద కలెక్టర్లు దృష్టి పెట్టాలి
* హోం ఐసోలేషన్ కోసం ఇండివిడ్యువల్‌గా ఇంట్లో ప్రత్యేక గది లేని వారికోసం కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టాం
* ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవల మీద దృష్టి పెట్టాలి
* వారికిచ్చే ఆహారం, బాత్‌రూం, బెడ్ల మీద దృష్టి పెట్టాలి
* వైద్యుల పర్యవేక్షణ బాగుందా లేదా? మందులు ఇస్తున్నారా? లేదా? ఆ మందులను కూడా జీఎంపీ ప్రమాణాలు ఉన్నవి ఇస్తున్నారా? లేదా? అన్నదాని మీద కలెక్టర్లు దృష్టి పెట్టాలి
* అలాగే రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు, జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి
* బెడ్లు, బాత్‌రూమ్స్, మెడికేషన్, ఆహారం.. ఈ నాలుగు అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి
* కోవిడ్ సెంటర్లలో నాణ్యత మీద దృష్టి పెట్టాలి
* కోవిడ్‌తో కలిసి బతకాల్సిన సమయం
* వ్యాక్సిన్ కనుగొనేంత వరకూ… మనం జాగ్రత్తలు తీసుకోవాలి
* అలాగే అనుమానితుల కోసం కూడా ఇస్తున్న క్వారంటైన్ సదుపాయాలు కూడా బాగుండాలి
* దేశంలో అన్ని రాష్ట్రాల సరిహద్దులు తెరిచారు
* అలాగే కొన్నిచోట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తున్నాయి
* దీని వల్ల సహజంగానే కేసులు పెరుగుతాయి
* అంతమాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు
* కాని, కేసులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిపోయి వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది
* కోవిడ్ సోకితే, కోవిడ్ ఉన్నట్టుగా అనిపిస్తే.. ఒక వ్యక్తి ఎవరికి కాల్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అన్నదానిపై తెలియాలి
* ప్రజలందరికీ ఈ మూడు విషయాలు తెలియజేయాలి
* దీని వల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది
* ప్రజల్లో చైతన్యం కలిగించడం మీద దృష్టి పెట్టాలి
* మనం సహాయం కోసం ఇచ్చే కాల్ సెంటర్ నంబర్లు, టెలి మెడిసిన్, 108 లాంటి నంబర్లు.. సమర్థవంతంగా పనిచేయాలి
* డమ్మీ చెకప్స్ కూడా చేయండి
* మన పనితీరును కూడా మనం సమీక్ష చేసుకుని లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి.
Read Here>>ఇసుక కొరత అనే మాట వినిపించకూడదు, వారం రోజుల్లో స్టాక్ చేయాలి, సీఎం జగన్ ఆదేశం