visakha utsav 2019..ప్రారంభించిన సీఎం జగన్

విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. 2020, డిసెంబర్ 28వ తేదీ శనివారం విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ నగర వాసులు, వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం RK బీచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా ఉత్సవ్‌ను ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనుంది కార్యక్రమం. ముగింపు వేడుకలకు గవర్నర్ రానున్నారు.
సీఎం జగన్ విశాఖ టూర్..హైలెట్స్ :-
* సభలో ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్‌కు అప్యాయంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి. ఆయనకు శాల్వతో సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం * చేసుకున్నారు.
* నవరత్నాలతో కూడిన ప్రజెంటేషన్ ఆకట్టుకుంది.
* బాణా సంచా మెరుపులతో ఆర్కే బీచ్ వెలిగిపోయింది.
విశాఖలో సీఎం జగన్ చేసిన శంకుస్థాపనల వివరాలు :-
* రూ. 1, 290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన.
* GVMC చేపట్టనున్న రూ. 905.05 కోట్లు.
* VMRDA చేపట్టనున్న రూ. 379. 82 కోట్లు.
* లా కాలేజీ నుంచి బీచ్ రోడ్డు వరకు 80 ఫీట్ల రోడ్ విస్తరణకు రూ. 7.5 కోట్లు.
* చుక్కవానిపాలెంలో 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్‌కు రూ. 90 కోట్లు.
* కైలాసగిరి ప్లానెటోరియం ఏర్పాటు కోసం రూ. 37 కోట్లు.
* సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్ కార్ పార్కింగ్, వాణిజ్య సదుపాయం కోసం రూ. 80 కోట్లు.
* నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థకు రూ. 88 కోట్లు.
* ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు.