CM Jagan : అద్దంకిలో వైసీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించే చాన్స్?

వైసీపీ చివరి సిద్ధం బహిరంగ సభ అద్దంకి నియోజకవర్గంలో ఇవాళ జరగనుంది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్ కత, చెన్నై జాతీయ రదారి పక్కనే..

CM Jagan : అద్దంకిలో వైసీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించే చాన్స్?

CM Jagan

CM Jagan Addanki Siddham Meeting : వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. ఈ సభల్లో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా, ఆదివారం చివరి సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరగనుంది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్ కత, చెన్నై జాతీయ రదారి పక్కనే సుమారు 200 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని సుమారు 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలిరానున్నారు. ఇందుకోసం వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

Also Read : Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్వీట్..!

ఇవాళ జరగనున్న సిద్ధం సభ చివరిది కావడంతో ఎన్నికల మ్యానిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలపై జగన్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. సిద్ధం సభా ప్రాంగణంలో ‘వై’ ఆకారంలో ప్రత్యేక ట్రాక్ ను ఏర్పాటు చేశారు. వైనాట్ 175 అంటూ పెద్ద బోర్డును ఏర్పాటు చేశారు. చివరి సిద్ధం సభ కావడంతో సీఎం జగన్ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. టీడీపీ, బీజేపీ, జసనసేన పార్టీల పొత్తులు ఖరారైన తరువాత సిద్ధం బహిరంగ సభ జరుగుతుండటంతో సభా వేదికగా సీఎం జగన్ ఆ మూడు పార్టీల పొత్తుపై ఎలా స్పందిస్తారనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read : Tdp Janasena Bjp Alliance : పవన్ కల్యాణ్ త్యాగం..! ఎట్టకేలకు బీజేపీ-టీడీపీ మధ్య స్నేహానికి బీజం

సిద్ధం బహిరంగ సభ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 4,200 మంది పోలీసులు, అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పదివేలకుపైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు సిద్ధం సభ జరగనుంది. ఈ సభలో జగన్ మోహన్ రెడ్డి కీలక అంశాలపై ప్రసంగం చేసే అవకాశం ఉంది.