CM Jagan Letter : ఇంధన ధరలు, విద్యుత్ సంక్షోభంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ఏపీని కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయా..? రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదా..? కేంద్రం స్పందించకపోతే ఏపీలో పవర్ కట్ అయినట్లేనా.. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖ అవుననే అంటోంది.

Jagan (1)
CM Jagan’s letter to PM Modi : ఏపీని కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయా..? రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదా..? కేంద్రం స్పందించకపోతే ఏపీలో పవర్ కట్ అయినట్లేనా.. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖ అవుననే అంటోంది. ఇంధన ధరలు, విద్యుత్ సంక్షోభంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే సమస్య ఉందని.. తక్షణమే సమస్యపై స్పందించాలని కోరారు.
ఏపీలో రెండు రోజులకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు మాత్రమే ఉందంటూ.. సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని.. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా మోదీకి కోరారు జగన్. ఏపీ పరిస్థితిని కూడా లేఖలో వివరించారాయన. ఏపీలో ప్రస్తుతం 185 నుంచి 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు.
AP High Court : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
కోవిడ్ తర్వాత.. ఏపీలో విద్యుత్ వినియోగం 20 శాతం మేర పెరిగిందన్నారాయన. గత ఆరు నెలల్లోనే 15 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. గత నెలలోనే 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరిందన్నారు జగన్. రాష్ట్ర అవసరాలను ఏపీ జెన్‌కో 45 శాతం మాత్రమే తీర్చగలుగుతోందని.. ఏపీలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద కేవలం అంటే కేవలం రెండు రోజులకే సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయంటూ మోదీకి వివరించారు జగన్.
బొగ్గు కొరత దేశంలోని విద్యుత్ ప్లాంట్లను సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదం ఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ సీఎం. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని వివరించారు. రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు సీఎం.
YSR Asara : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు
బహిరంగ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు గణనీయంగా పెరిపోతున్నాయని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ టైమ్ విద్యుత్ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం యూనిట్ ధర ఇరవై రూపాయలకు పెరిగిందని చెప్పారు. కొన్నిసార్లు ఈ ధరకు కూడా విద్యుత్ అందుబాటులో ఉండటం లేదని.. ఇవి డిస్కమ్‌ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు సీఎం. పరిస్థితి తీవ్రతరం అవుతోందని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు .