AP High Court : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఏపీ సర్కార్ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

High Court

housing scheme for the poor : ఏపీ సర్కార్ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలంతో ఇచ్చిన లే అవుట్‌లను, కేటాయింపులను…, ఏపీలో గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలలోని పలు నిబంధనలను కోర్టు తప్పుపట్టింది.

సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాల నిర్మాణంతో మౌలిక సమస్యలు తలెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. మంచినీటి సమస్యలు తలెత్తుతాయని, అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంటి నిర్మాణం అంశాలు, ప్రభుత్వ చర్యలపై…128 మంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..108 పేజీల తుది తీర్పును వెల్లడించింది.

CM Jagan : సీఎం జగన్ తిరుపతి పర్యటన

ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాల నిర్మాణానికి సంబంధించి లే అవుట్లలో ఉత్పన్నమయ్యే సమస్యలు గుర్తించకుండా ఇల్లు కట్టుకోమని ఒత్తిడి చేయడం సరికాదంది కోర్టు.

పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి కేంద్ర గృహనిర్మాణ, ఆరోగ్య, పర్యావరణ శాఖలలోని నిపుణులతో ఒక కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచిస్తూ.. నెల రోజుల్లో దీనిపై నివేదిక వచ్చేలా చూడాలని ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటివరకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించింది.