పిల్లల మేనమామగా అడుగుతున్నా..రూ. 15 వేలల్లో రూ. 1000 ఇవ్వండి

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 09:55 AM IST
పిల్లల మేనమామగా అడుగుతున్నా..రూ. 15 వేలల్లో రూ. 1000 ఇవ్వండి

Updated On : January 9, 2020 / 9:55 AM IST

‘బడుల్లో బాత్ రూంలు, వాచ్ మెన్‌ల మీద కాస్త ధ్యాస పెట్టండి..బాత్ రూంల మెంటెనెన్స్ కోసం ఒక మనిషి పెట్టుకుంటే..జీతం రూ. 4 వేలు అనుకోండి..వాటి సామాన్ల కోసం మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది అనుకొండి..బాత్ రూం కోసం రూ. 6 వేలు, ఒక వాచ్ మెన్ కోసం రూ. 4 వేలు అవుతోంది అనుకోండి..సొమ్ములో మీరంతా భాగస్వాములు కావాలి..స్కూళ్లకు సహాయం చేయగలిగితే..రూ. 15 వేలు ప్రభుత్వం ఇస్తోంది..అందులో నుంచి రూ. 1000 ఇవ్వాలని’ కోరుతున్నా అంటూ సీఎం జగన్ కోరారు.

 

పిల్లల మేనమామ కోసం అడుగుతున్నట్లు..స్కూళ్లలో కనీస సదుపాయాల కోసం ఇవ్వాలని అడుగుతున్నట్లు వెల్లడించారు. పేరెంట్స్ కమిటీకి ఈ డబ్బు ఇవ్వడం ద్వారా..బాత్ రూంలు మెరుగుపడుతాయన్నారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

నాడు – నేడు కార్యక్రమం ద్వారా..మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని, కానీ మెంటెనెన్స్ లేకపోతే ఫెయిల్ అవుతాయన్నారు. కాబట్టి..విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి సారించాలని, ప్రతి సంవత్సరం రూ. 1000 ఇవ్వడం ద్వారా ప్రశ్నించే అధికారం వస్తుందన్నారు. పిల్లలను బడులకు పంపించడమే కాకుండా..వాటి బాగోగుల కోసం ఆలోచించాలని మరోసారి సూచించారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పిల్లల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

అర్హత ఉండి కూడా తల్లులు అమ్మఒడిలో నమోదుకాకపోతే..ఎవరూ హైరానా పడాల్సినవసరం లేదని, మరో నెల రోజుల సమయం ఇస్తామన్నారు. ఫిబ్రవరి 09వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 
Read More : సీఎం జగన్ వరాలు : సాక్స్, యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, బెల్టు