YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రీజనల్ కో-ఆర్డినేటర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేలా బాధ్యతలు అప్పగించారు జగన్. అలాగే సీఎం జిల్లా పర్యటనల్లో ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకు సమన్వయ బాధ్యతలు కేటాయించారు. త్వరలో ప్రారంభమయ్యే జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఇకపై వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు కీలకంగా ఉండబోతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇక నుంచి ప్రతి కార్యక్రమం ప్రధానమైనదే. ఉన్న కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చే బాధ్యతను రీజనల్ కో-ఆర్డినేటర్లకు అప్పగించారు సీఎం జగన్.(YS Jagan Mohan Reddy)
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇవాళ్టి నుంచి చాలా మంది ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు నెలన్నర బ్రేక్ తర్వాత గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది అనే దానిపై ప్రతీ రోజూ రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయం జరపాలి.
మరోవైపు జగనన్నే మన భవిష్యత్తు క్యాంపెయిన్ పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. 7లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఈ క్యాంపెయిన్ ను నిర్వహించనున్నారు. ఈ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్లపై ఉంది. గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైసీపీ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి వివరించాలి. అప్పటికి, ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ప్రజలకు తెలియజేయాలి. అలాగే ప్రజల అభిప్రాయం తెలుసుకునేలా ఈ క్యాంపెయిన్ ఉండబోతోంది.(YS Jagan Mohan Reddy)
ఇందులో భాగంగా ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడం, మొబైల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అతికించే కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు ఒక ప్రశ్నాపత్రం కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతీ లబ్దిదారుకు అందిస్తారు. వీటన్నింటికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇవన్నీ మానిటరింగ్ చేసే బాధ్యతను సీఎం జగన్ రీజనల్ కో-ఆర్డినేటర్లకు అప్పగించారు.
Also Read..Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?
ఇక ఎన్నికల సమయం కాబట్టి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల మధ్య ఉన్న విబేధాలను తొలగించాలి. అసంతృప్తులకు సర్ది చెప్పాలి. పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసే విధంగా చూడాలి. ఈ బాధ్యతలన్నింటిని.. రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించారు సీఎం జగన్.
ఇక త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా రీజనల్ కో-ఆర్డినేటర్లే చూసుకోవాలి.