ఏపీలో భూ సర్వే..శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయం

cm ys jagan Review Land survey to begin on January 1, 2021 : శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న భూ సర్వే మొదలు కావాలని, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. భూ సర్వే రెండేళ్లలో అంటే జనవరి 2023 నాటికి మూడు దశల్లో పూర్తవుతుందన్నారు.
⇒ వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో అంటే జనవరి 2023 నాటికి మూడు దశల్లో పూర్తి చేయాలని టార్గెట్ నిర్ధేశించారు.
డ్రోన్ల ద్వారా గ్రామ కంఠాలను స్పష్టంగా ఫొటోలు.
https://10tv.in/andhra-pradesh-ys-jagan-announced-ysr-bheema/
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలోని వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే నిర్వహించాలని జగన్ ఆదేశించారు. గతంలో రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ డిజిటలైజేషన్ జరుగుతుంది.
⇒ ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు పని చేస్తాయి.
⇒ రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలోని వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుంది.
⇒ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే.
⇒ ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాల పని.
⇒ కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా భూ సర్వే.
⇒ ఈ కార్యక్రమానికి ‘వైఎస్సార్–జగనన్న సమగ్ర భూ సర్వే’ లేదా ‘రాజన్న–జగనన్న సమగ్ర భూ సర్వే’ అని పేరు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.