Constable Death Case: ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చిన భార్య.. కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు ..

రమేష్ అత్తామామలు పెళ్లికి కట్నం కింద అరఎకరం భూమి ఇచ్చారు. ఆ ఆరఎకరం భూమిపై భార్య శివాని, ప్రియుడు రామారావు కన్నేశారు. కానిస్టేబుల్ రమేష్‌ను చంపి అర ఎకరం భూమి అమ్మేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని భావించింది.

Constable Death Case: ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చిన భార్య.. కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు ..

Constable Ramesh Case

Updated On : August 4, 2023 / 11:03 AM IST

Constable Suspicious Death: విశాఖపట్టణం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బుర్రి రమేష్ కుమార్ (40) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకున్న రమేష్ ఉదయం చూసేసరికి చనిపోయి కనిపించాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రమేష్ ఎలా మరణించి ఉంటాడనే విషయంపై విచారణ మొదలు పెట్టారు. అయితే, పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడుతో కలిసి భార్య శివానినే రమేష్‌ను కడతేర్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శివానిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నిజాన్ని అంగీకరించింది.

Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

రమేష్ నివాసం ఉంటున్న ఇంటిముందే రామారావు అనే ట్యాక్సీ డ్రైవర్ కారు పార్కింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో డ్రైవర్ రామారావుకు కానిస్టేబుల్ భార్య శివానికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుందని పోలీసులు గుర్తించారు. అయితే, వీరిద్దరి మధ్య నడుస్తున్న సంబంధాన్ని రమేష్ ప్రశ్నించడంతో పలుసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని తెలిసింది. దీంతో రమేష్‌ అడ్డుతొలగించుకోవాలని రామారావు, శివాని భావించారు. నీలా అనే వ్యక్తికి రెండు లక్షల సుఫారీ ఇచ్చి మర్డర్ చేసేందుకు ప్రియుడు రామారావు, కానిస్టేబుల్ భార్య శివాని ఒప్పందం కుదుర్చుకున్నారు. రమేష్ అత్తామామలు పెళ్లికి కట్నం కింద అరఎకరం భూమి ఇచ్చారు. ఆ ఆరఎకరం భూమిపై భార్య శివాని, ప్రియుడు రామారావు కన్నేశారు. కానిస్టేబుల్ రమేష్‌ను చంపి అర ఎకరం భూమి అమ్మేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని భావించింది.

Crime News: పార్కులో ఉన్న అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన యువకుడు

రమేష్‌కు మద్యం తాగించి, ఆ తరువాత నిద్రపోతున్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు చేయగా.. శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమేష్, శివానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.