ఏపీ రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రధానగా నెల్లూరు జిల్లా వణికిపోతోంది. ఎక్కువ సంఖ్య ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసులను వణికిస్తోంది. తొలి కరోనా కేసు ఇక్కడే బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి ప్రారంభమైంది.
ఈ జిల్లాకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇళ్లు వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. వైరస్ రాదులే..అనుకున్న కరోనా లేటుగా ఎంట్రీ ఇచ్చినా..భయపెడుతోంది. జిల్లాలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతం. పొరుగున తమిళనాడు రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగానే ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం వరకు 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 12 కేసులు పెరగడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నెల్లూరులో 32 మంది కరోనా బాధితులున్నారు. తాజాగా నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం.
ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఈ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉండడం, వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ గా రావడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సమావేశానికి 70 మంది హాజరయినట్లు సమాచారం. వీరందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి..నెల్లూరు జిల్లాకు ప్రజలు వచ్చారని సమాచారం.
దీంతో జిల్లాకు వచ్చే మార్గాలను దిగ్భందం చేశారు. కానీ అప్పటికే వైరస్ వ్యాపించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి స్పీడుగా వ్యాపించింది. కరోనా వైరస్ కారణంగా జిల్లా స్తంభించిపోయింది. అమలులో ఉన్న లాక్ డౌన్ మరింత కఠినతరం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా హాళ్లు, మాల్స్, వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
జిల్లాల వారిగా : – చిత్తూరు, తూర్పు గోదావరిలో 9, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 14, గుంటూరు 20, కృష్ణా 23, కడప 19, ప్రకాశం 17 జిల్లాలో కేసులు నమోదయ్యాయి.
Also Read | లాక్‌డౌన్‌ని ధిక్కరించి దేవాలయాల్లో భక్తులు: పోలీసులపై దాడులు