కరోనా మనతోనే..వైరస్ ను కట్టడి చేయలేం – సీఎం జగన్

కరోనా మనతోనే..వైరస్ ను కట్టడి చేయలేం – సీఎం జగన్

Updated On : June 21, 2021 / 1:23 PM IST

కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట్టడి చేయవచ్చన్నారు. వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ పరీక్షల విషయంలో ఏపీ నెంబర్ వన్ లో నిలిచిందన్నారు. కరోనాను అంటరాని రోగంగా చూడొద్దని, ఇదొక చిన్న జ్వరంలాంటిదేన్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

కరోనా విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వైరస్ ను పూర్తిస్థాయిలో కట్డడి చేయలేమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్ల కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడబోతోందన్నారు. దీనిని ప్రజలు గమనించాలని..కానీ భయంకరమైన వ్యాధి, అంటరానితనం వస్తుందని..జరుగుతుందన్న ప్రచారాన్ని బుర్రలో నుంచి తీసేయాలని సూచించారు. సర్వసహజంగా ఇంకా మరికొంత మందికి వ్యాపించే అవకాశం ఉందని, స్వైన్ ఫ్లూ ఎలా సోకిందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇవన్నీ తగ్గే వ్యాధులన్నారు. కరోనా వైరస్ ఎవరికి ఉందో తెలియని పరిస్థితి ఉందని,

81 శాతం మంది ఇళ్లలోనే ఉండి..వ్యాధి తగ్గుతోందని మరోసారి చెప్పారు. ఎవరికైనా రావొచ్చని, వచ్చిన సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైరస్ లక్షణాలు కనిపించగానే…104కు ఫోన్ చేయడం, 14410 (టెలీ మెడిసిన్) ఫోన్ కు చేయాలని సూచించారు. ఇంటి వద్దకే వచ్చి మందులు ఇచ్చి వెళుతారని, పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. నయం అయ్యే చిన్న జ్వరం లాంటిదని, వయస్సు ఎక్కువగా ఉన్న వారిపైనే ప్రభావం చూపిస్తోందన్నారు. మంచి ఆహారం తీసుకోవాలని, రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రతింటిెకి మూడు మాస్కులు అందిస్తున్నామని, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు కడుతున్నారన్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించాలని, చిన్న చిన్న విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రీన్ జోన్లలో మాములుగానే పనులు చేసుకోవచ్చని, రెడ్ జోన్ ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు సీఎం జగన్.