ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాటిజివ్ వ్యక్తి పరార్

  • Published By: sreehari ,Published On : March 19, 2020 / 09:57 AM IST
ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాటిజివ్ వ్యక్తి పరార్

Updated On : March 19, 2020 / 9:57 AM IST

ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ 23ఏళ్ల యువకుడు పరారయ్యాడు. ఐసోలేషన్ వార్డు నుంచి అతడు తప్పించుకుని పారిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. పారిపోయిన యువకుడి కోసం పోలీసులు, వైద్యాధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు.

అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడి నుంచి అతడు పరారైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.

తనకు కరోనా వైరస్ సోకిందని తెలిసిన యువకుడు మానసిక బాధతోనే వార్డు నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. సీసీ ఒంగోలు ప్రాంతంలోని పలు చోట్ల కెమెరాలతో పాటు అన్నిచోట్ల యువకుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అతడు ఎక్కడికి పారిపోయి ఉంటాడనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

See Also | గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ ఇందిరా వర్మకు కరోనా పాజిటీవ్