COVID-19 AP Strain : వెరీ డేంజరస్.. ఏపీ కోవిడ్ స్ట్రెయిన్ 15 రెట్లు తీవ్రమైనది.. నిపుణుల హెచ్చరిక
ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది.

Covid 19 Andhra Pradesh Strain At Least 15 Times More Virulent
COVID-19 AP Strain : ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది. విశాఖపట్నం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వేరియంట్ విజృంభిస్తోందని అంటున్నారు. కానీ, ఏపీలో ముందుగా ఈ కొత్త వేరియంట్ జాతిని కర్నూలులో మొట్టమొదటగా కనుగొన్నట్టు చెబుతున్నారు. దీన్నీ ఏపీ స్ట్రెయిన్ గా పిలుస్తున్నారు.
మునుపటి కరోనా వైరస్ల కంటే కనీసం 15 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వేరియంట్లలో భారతీయ వేరియంట్ B1.617, B1.618 వేరియంట్ల కంటే ప్రమాదకరంగా ఉండవచ్చునని అంటున్నారు. ఈ ఏపీ స్ట్రెయిన్ ఎంత ప్రాణాంతకమో ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జాతికి సంబంధించి నమూనాలను విశ్లేషణ కోసం CCMBకి పంపారు. విశాఖపట్నంలో ప్రస్తుతం విజృంభిస్తోన్న వేరియంట్ గత సంవత్సరం మొదటి వేవ్‌లో మనం చూసినదానికి చాలా భిన్నంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చుని సీనియర్ వైద్యులు చెబుతున్నారు.
కొత్త వేరియంట్లో తక్కువ పొదిగే కాలంతో పాటు వ్యాధి తీవ్రత చాలా వేగంగా ఉందని గమనించినట్టు తెలిపారు. గతంలో వైరస్ బారిన పడిన రోగి హైపోక్సియా లేదా డిస్ప్నియా దశకు చేరుకోవడానికి కనీసం ఒక వారం సమయం పట్టేది. కానీ ఈ స్ట్రెయిన్ సోకిన బాధితుల్లో మూడు లేదా నాలుగు రోజుల్లో తీవ్రమైన పరిస్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. అందుకే ఆక్సిజన్ లేదా ఐసియూ పడకల అవసరం పడుతోందని అంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వీటి కొరత పెరిగిందని అన్నారు. ఈ స్ట్రెయిన్ సోకిన వ్యక్తికి నలుగురు నుంచి ఐదుగురికి సోకడానికి అవకాశం ఉంటుంది.
యువ జనాభాతో పాటు ఫిట్నెస్, అధిక రోగనిరోధక శక్తి ఉన్నవారిపై కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందని గుర్తించారు. ఈ వేరియంట్ చాలా తీవ్రమైనదని, అందుకే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరచడం, వీలైనంతవరకూ ఇంట్లో ఉండడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించడమే ఉత్తమ మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.