Covid In Andhrapradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి

Covid In Andhrapradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి

Updated On : December 26, 2020 / 4:47 PM IST

Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 42 వేల 911 శాంపిల్స్ పరీక్షించినట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక్కరు చనిపోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 442 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, శనివారం వరకు రాష్ట్రంలో 1,15,74,117 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 80 వేల 712కి కరోనా కేసులు చేరుకున్నాయి. 7 వేల 092 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3 వేల 700 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 69 వేల 920 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా :
అనంతపురం : 10. చిత్తూరు 39. ఈస్ట్ గోదావరి : 53. గుంటూరు : 56. కడప : 15. కృష్ణా : 38. కర్నూలు : 01. నెల్లూరు : 16. ప్రకాశం : 01. శ్రీకాకుళం : 04. విశాఖపట్టణం : 18. విజయనగరం : 04. వెస్ట్ గోదావరి : 27. మొత్తం 282.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,15,74,117. కేరళ : 76,13,415. కర్నాటక : 1,35,14,362. తమిళనాడు : 1,37,95,803. తెలంగాణ : 66,55,987. గుజరాత్ : 93,30,491. మహారాష్ట్ర : 1,24,01,637. రాజస్థాన్ : 51,29,178. మధ్యప్రదేశ్ : 44,79,202. ఇండియా : 16,71,59,589.