Purandeswari-GVL : ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’అంటూ జీవీఎల్‌‌కు పురందేశ్వరి కౌంటర్

ఏపీ బీజేపీలో కొత్త ‘పేర్లు’పంచాయితీ మొదలైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా? అంటూ చేసి వ్యాఖ్యలకు బీజేపీ నేత పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’ అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ఇచ్చారు.

Purandeswari-GVL : ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’అంటూ జీవీఎల్‌‌కు పురందేశ్వరి కౌంటర్

Daggubati Purandeshwari counter to BJP MP GVL

Updated On : February 17, 2023 / 3:42 PM IST

Purandeswari-GVL : ఏపీ బీజేపీలో కొత్త ‘పేర్లు’పంచాయితీ మొదలైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా? అంటూ చేసి వ్యాఖ్యలకు బీజేపీ నేత పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’ అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకువచ్చి..పేదలకు నిజమైన సంక్షేమం..2రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు,జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయాలు వంటివి ప్రజలకు అందించారని..మరొకరు విద్యార్దులకు ఫీజు రీయింబ్స్ మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీవంటివి అందించారని ట్విట్టర్ లో పురందేశ్వరి పేర్కొన్నారు. ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’ అంటూ ట్విట్టర్ వేదికగా జీవీఎల్ కు కౌంటర్ఇచ్చారు.

GVL Narasimha Rao: రాష్ట్రంలో రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు కనిపించవా..?

కాగా జీవీఎల్ బందర్ రోడ్డులో వంగవీటి మోహనరంగా విగ్రహానికి జీవీఎల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ… ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా?రాజకీయాలు అనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కాదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లనే పెడుతున్నారని, మిగిలినవారి పేర్లు కనిపించవా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో జిల్లాల పున:ర్విభజన సమయంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగుబలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించానని అన్నారు. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన అని, మూడేళ్లలోనే 35ఏళ్ల ఖ్యాతిని వంగవీటి రంగా సంపాదించుకున్నారని జీవీఎల్ అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కులాలకు అతీతంగా వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు పెట్టాలన్నారు జీవీఎల్.. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా అంటూ ప్రశ్నించారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు పురందేశ్వరం ట్విట్లర్ ద్వారా ‘ ఇద్దరు కాదు ఆ మహానుభావులు’అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా ఆ ఇద్దరు అంటే దివంగత సీఎంలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్ధేశించి జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.