MLA Kotaru Abbaya Chowdary : విద్యార్థిని ఫోన్ కాల్.. వెంటనే సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
ఓ విద్యార్థిని ఫోన్ కాల్ తో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఓ విద్యార్థిని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ఫోన్ చేసింది. విద్యార్థులు పడుతున్న సమస్య గురించి చెప్పుకుంది. విద్యార్థిని ఫోన్ కాల్ తో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెంటనే స్పందించారు.

MLA Kotaru Abbaya Chowdary : ఓ విద్యార్థిని ఫోన్ కాల్ తో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఓ విద్యార్థిని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ఫోన్ చేసింది. విద్యార్థులు పడుతున్న సమస్య గురించి చెప్పుకుంది. విద్యార్థిని ఫోన్ కాల్ తో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెంటనే స్పందించారు.
విద్యార్థుల కోసం తన పనులను పక్కన పెట్టి మరీ ఏలూరు కొత్త బస్టాండ్ కు వెళ్లారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరిపడ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. దీనిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. అధికారులతో మాట్లాడారు. 5 నిమిషాల్లో విద్యార్థుల కోసం బస్సును ఏర్పాటు చేయించారు. విద్యార్థులు తమ గమ్యస్థానాలకు వెళ్లేలా చూశారు. అంతేకాదు, విద్యార్థులతో కలిసి ద్వారకా తిరుమల వరకు బస్సులో ప్రయాణం చేశారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.