Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి మరింత గుర్తింపు.. సొంత డబ్బులు ఖర్చు చేస్తానని వెల్లడి

లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసిన

Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను ప్రభుత్వం సొమ్ముతో పాటు తన సొంత సొమ్మును కేటాయించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలు, ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికి ప్రభుత్వం తరపున వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు తీసుకెళ్లి ప్రధానం చేస్తుంటారు. వీటి విషయంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read : వైసీపీలో వలసలకు కారణం ఏంటి? సంక్షోభం నుంచి బయటపడేదెలా?

లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసిన దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు.. ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. వీటిని.. మన రాష్ట్రానికి వచ్చే అతిథులకు, ప్రతినిధులకు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవారికి రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పవన్ అభిప్రాయ పడ్డారు.

Also Read : ఇప్పుడు మేము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదు: ఏఆర్ డెయిరీ సంస్థ

అయితే, అతిథులకు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. పవన్ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. పవన్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను తిలకించారు. కుమార్తెకు ఇష్టమైన వాటిని సొంత డబ్బులు చెల్లించి పవన్ కొనుగోలు చేశారు.