ఇప్పుడు మేము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదు: ఏఆర్ డెయిరీ సంస్థ
ఇప్పుడు తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని వివరించింది.

Tirumala Laddu (Photo Credit : Google)
తిరుమల తిరుపతి లడ్డూకి వాడిన నెయ్యి వివాదంపై తమిళనాడు ఏఆర్ డెయిరీ సంస్థ పలు వివరాలు తెలిపింది. నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందని, అందులో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామని, జూన్, జులైలో నెయ్యి సరఫరా చేశామని పేర్కొంది.
ఇప్పుడు తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని వివరించింది. తమ కంపెనీలో సరఫరా చేసే నెయ్యిని ఎలాంటి టెస్ట్ అయినా చేసుకోవచ్చని తెలిపింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంది.
తమ సంస్థ నెయ్యిని తాము సైతం ఎన్డీడీబీలో పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని తమకు రిపోర్టు ఇచ్చారని చెప్పింది. కాగా, శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని టీడీపీ నేతలు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కూడా స్పందించింది. టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని వైసీపీ అంటోంది.
తిరుమల లడ్డూ వివాదం.. అసలు నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? గుర్తించడం ఎలా?