వాళ్లకి.. జగన్ లాంటి నాయకుడే కరెక్ట్..!- పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని.

వాళ్లకి.. జగన్ లాంటి నాయకుడే కరెక్ట్..!- పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

Pawan Kalyan : పిఠాపురంలో జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు పవన్. ఇంటర్వ్యూలు ఇవ్వడు, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు.. వీళ్లకి జగన్ లాంటి నాయకుడే కరెక్ట్ అని పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. మీడియా ప్రతినిధి ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఓ ప్రశ్న అడిగారు. దీంతో పవన్ కల్యాణ్ ఒకింత అసహనానికి గురయ్యారు. ఆ మీడియా ప్రతినిధిపై సీరియస్ అయ్యారు. ఇది ప్రెస్ మీట్ కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇదే సమయంలో జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. మీడియా ప్రతినిధి ఒకరు ఓ ప్రశ్న అడిగారు. దీనికి పవన్ కల్యాణ్ కాసింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ”ఇది ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ లా మాట్లాడొద్దు. సభా సంస్కారమేనా ఇది? ముందు వినాలి. అలా కుదరదు. సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభ? ఏది అభినందన సభ? అది తెలుసుకోకపోతే ఎలా? ఇది కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సభ. పవన్ కల్యాణ్ అనగానే అందరికీ అలుసు, చులకన అయిపోయింది..” అంటూ ఆ మీడియా ప్రతినిధిపై సీరియస్ అయ్యారు పవన్ కల్యాణ్.

నేను కేవలం ఎమ్మెల్యేని కాదు, ఎన్డీయేకి అండగా నిలబడ్డ వ్యక్తిని- పవన్ కల్యాణ్
”నేను కేవలం ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీయేకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది. నాకు తెలుసు ఎప్పుడు రావాలని. మొత్తం బాధ్యతలు తీసుకున్నా. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. పవన్ కల్యాణ్ అనగానే అందరికీ అలుసు, చులకన అయిపోయింది. వీళ్లకి జగన్ లాంటి నాయకుడే రైట్ అనిపిస్తుంది ఒక్కోసారి. జగన్ ఇంటర్వ్యూలు ఇవ్వడు, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ల దగ్గర భయంగా ఉంటారు. చేతులు కట్టుకుని కూర్చుంటారు.

మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని. పట్టుబడితే వదలను. నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడండి. గుండెల్లో పెట్టుకుని మర్యాద ఇస్తా. నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్ పాటిస్తాం. కానీ, అలుసుగా తీసుకుంటే మాత్రం నేను అంత తేలిగ్గా వదలను.

నేను ఒక వ్యవస్థను నడపాల్సిన వాడిని. కొన్నిసార్లు గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాటిచ్చాను. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఇది జనవాణి కార్యక్రమం కాదు. ఆత్మీయ సభ ఇది. ఇది గుర్తించాలి. పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు.. పిఠాపురం కూటమి నాయకులు బలంగా పోరాటం చేయకపోయి ఉంటే రాష్ట్రంలో ఫలితాలు మరోలా ఉండేవి. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు దేశం మీద ప్రేమ ఉంది. అసెంబ్లీలో నేను నా పార్టీ గురించి మాట్లాడలేదు. పొట్టి శ్రీరాములు బలిదానమే లేకపోతే ఈరోజున మనకు ఆంధ్ర రాష్ట్రం ఉండేది కాదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.