Chandrababu-Pawan Kalyan Meeting : చంద్రబాబు, పవన్ భేటీతో వేడెక్కిన ఏపీ పాలిటిక్స్.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.

Chandrababu-Pawan Kalyan Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. పరామర్శల కోసం జరుగుతున్న సమావేశం పొత్తులకు పొద్దు పొడుపుగా మారుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని నిన్నటి భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు.

అంటే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఇరువురు నేతలు, పార్టీలు సిద్ధమయ్యాయనే భావించాలి. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహాంలో ఏపీ బీజేపీ పాత్ర ఏమిటని ఇప్పుడు అందరూ ఆతృతంగా గమనిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు జనసేన, బీజేపీ మధ్య మిత్రబంధం ఉంది. ఇప్పుడు శతృత్వం ఏమీ లేకపోయినప్పటికీ అప్పటి స్నేహం మాత్రం కొనసాగుతుందన్న పరిస్థితీ లేదు.

Chandrababu Pawan Kalyan Meeting : టార్గెట్ వైసీపీ.. ఒక్కటైన టీడీపీ, జనసేన..! చంద్రబాబు, పవన్ ఏం చర్చించారంటే..

ప్రజావ్యతిరేక ప్రభుత్వంతో పోరాడేందుకు తాను అడిగిన రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వడం లేదని పవన్ ఆరోపణలు చేస్తున్నారు.  అయితే మ్యాప్ ఎప్పుడో ఇచ్చామని, అధిష్టానంతోనే మాట్లాడుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. చంద్రబాబుతో కలిసి పనిచేసే ప్రస్తక్తే లేదని ఒకవైపు బీజేపీ చెబుతుంటే మరొవైపు జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా సమావేశం అవుతున్నారు. త్వరలో బీజేపీ నేతలను కలిసి మాట్లాడే ఉద్ధేశంలో పవన్ ఉన్నారు.

పనవ్ చెప్పినా చంద్రబాబుతో సయోధ్యకు రాష్ట్ర బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారు. వైసీపీతో అధికారికంగా స్నేహం లేనప్పటికీ అధికారి పార్టీకి, బీజేపీకి మధ్య రహస్య స్నేహం ఉందన్న విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలు గమనిస్తే పవన్ కోసమో, చంద్రబాబు కోసమో తన అభిప్రాయాలను మార్చకునే ఉద్ధేశంలో లేరన్న అభిప్రాయం కల్గుతుంది.

Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజం.. గతంలోనూ పొత్తులు పెట్టుకున్నాం: చంద్రబాబు

దీంతో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీపై పడింది. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకుంటే ఢిల్లీ బీజేపీ వ్యూహం ఎలా మారుతుందన్నదే ప్రస్తుతం ప్రాధాన్యత అంశంగా ఉంది. ఇక మరోవైపు టీడీపీ, జనసేన అడుగులు గమనిస్తే పొత్తు ఖరారైనట్లేనన్న భావన కనిపిస్తోంది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు అంగీకారం తెలిపాయి. ఇక నుంచి ప్రభుత్వంపై ఉమ్మడి దాడి చేయాలని నిర్ణయించాయి.

ట్రెండింగ్ వార్తలు