Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్‌డీ అధికారి పి.శేషాద్రి.. 'డాలర్' శేషాద్రి కన్నుమూశారు.

‘Dollar’ Seshadri: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్‌డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. వైజాగ్‌లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రికి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే శేషాద్రి కన్నుమూశారు. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలోనే ఉన్నారు డాల్లర్ శేషాద్రి. 2007లో రిటైర్మెంట్ అయినా.. శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో OSDగా కోనసాగుతున్నారు.

డాలర్ శేషాద్రిపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో విమర్శలు కూడా అన్నే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ విరమణ పొంది పదేళ్లు దాటినా.. నేటికీ తన సేవలను కొనసాగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 50ఏళ్ల నుంచి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాలైన వ్యవహారాలపైన డాలర్ శేషాద్రికి పట్టుంది.

Andhra Pradesh Rain : వామ్మో మళ్లీ వానగండం, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

దేవాలయ సాంప్రదాయాలపైన, దేవాలయ క్యూలైన్ల నిర్వహణా వ్యవహారాల పైన డాలర్ శేషాద్రికి ఉన్న నాలెడ్జ్ ఎవరికీ లేదు. ఓ సాధారణ గుమాస్తాగా చేరి చివరకు దేవస్థానం ఓఎస్‌డీ స్థాయికి ఎదిగారు డాలర్ శేషాద్రి. డాలర్ శేషాద్రిపై ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ ఆయనను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పక్కన పెట్టలేదు. శేషాద్రి సేవలను టీటీడీ వినియోగించుకుంటూనే ఉంది.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

ట్రెండింగ్ వార్తలు