జగన్ ఉన్మాది : 5 కోట్ల ప్రజల సమస్య..అందరూ ఆలోచించండి

మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..జగన్ ఒక ఉన్మాది..ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..5 కోట్ల ప్రజల సమస్య..ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మనుషుల మధ్య విధ్వేషాలు, విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఉద్యమం అణిచివేయాని చూస్తే..ఇంకా ఎక్కువవుతుందని, సమస్య తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దు అని చెప్పారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 24 గంటల పాటు దీక్ష చేపట్టారు. దీక్షకు బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…
రాష్ట్ర విభజన తర్వాత మనకంటూ ఒక రాజధాని ఉండాలని అమరావతి నిర్మాణం చేపట్టడం జరిగిందని, టీడీపీ హాయాంలో మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఎలాంటి ఖర్చు లేకుండా అభివృద్ధి చేయవచ్చన్నారు. జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
జగన్ చెప్పినట్లే..కమిటీలు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని ఆరోపించారు. శివమరామకృష్ణ నివేదికలో ఇచ్చిన అంశాలను పట్టించుకోవడం లేదని జీఎన్ రావు కమిటీ నివేదిక బోగస్ అన్నారు. విజయ్ కుమార్ కించపరిచేటట్లు ప్రచారం చేస్తున్నారని, పోరాడే వారిపై కేసులు పెడుతూపోతే సహించమని బాబు హెచ్చరించారు.
Read More :JNU అధికారులతో MHRD మీటింగ్