Drone (2)
Drone detection in Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరోసారి డ్రోన్ కలకలం నెలకొంది. డ్రోన్ విషయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి వద్ద డ్రోన్‌ను భక్తులు గుర్తించారు. భక్తులు ఇచ్చిన సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ తెచ్చినవారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆలయ పుష్కరిణీ వద్ద కొందరు వ్యక్తులు డ్రోన్ ను ఎగురవేశారు. డ్రోన్ సంచరిస్తున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమచారం అందించారు. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయింది. డ్రెన్ వెంట పరుగులు తీసి టెక్నాలజీతో కిందికి దించివేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Thirumala : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ ప్రాంతంలోనే రిమోట్ తో డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రోన్ ఎందుకు ఎగరవేశారు..? ఆలయం వద్దకు ఎలా తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.
శ్రీశైలం ఆలయం పక్కనే ఉన్న పుష్కరణీ వద్ద డ్రోన్ ఎగురవేస్తున్నా..ఆలయ సిబ్బంది గుర్తించలేదు. ప్రధాన ఆలయ గోపురానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పట్టుపడ్డ ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కు చెందిన వారుగా గుర్తించారు. శ్రీశైలం ఎందుకు వచ్చారన్న కోణం ఆరా తీసున్నారు. అనంతరం వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు.
Omicron Cases : దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు..17 రాష్ట్రాల్లో వేరియంట్
గతంలో శ్రీశైలం ఆలయంలో రాత్రిపూట డ్రోన్ లు కలకలం రేపడంతో ఆ ప్రాంతంలో డ్రోన్స్ ను నిషేధించారు. అయినా శ్రీశైలం ఆలయం వరకూ డ్రోన్స్ ఎలా తీసుకొచ్చారు? వారికి సహకరించిన వారు ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.