Thirumala : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఆన్ లైన్ లో 4.60 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

Thirumala : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Tirumala

Updated On : December 24, 2021 / 11:30 AM IST

Srivari Special Entrance Darshanam Tickets : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల అయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేశారు. టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేశారు. ఆన్ లైన్ లో 4.60 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేశారు. జనవరి నెలకు సంబంధించి రోజుకు 20 వేల చొప్పున ఆరు లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

అలాగే రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల సర్వదర్శనం టికెట్లను ఇస్తామని వెల్లడించింది. సర్వదర్శనం ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో డిసెంబర్‌ 31 నుంచి ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌ టోకెన్లు కూడా రోజుకు 5 వేల చొప్పున జారీ చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు.

Tirumala Udayastamana seva : తిరుమల ఆలయంలో ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లు

జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక నిన్ననే వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.