AP Municipal Elections : ఏపీలో మళ్లీ ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ.. 26న పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు..
AP Municipal Elections : ఏపీలో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
SEC Anil Chandra Punetha
AP Municipal Elections : ఏపీలో ఇటీవల కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే, ఆ సమయంలో పలు కారణాల వల్ల కొన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read : AP Govt : ఏపీలోని పేద వర్గాల ప్రజలకు శుభవార్త.. సర్కార్ కీలక నిర్ణయం.. తక్కువ ధరకే బియ్యం..
ఏపీలో పెండింగ్‌లో ఉన్న నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం మధ్యాహ్నం ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునే నోటిఫికేషన్ విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈనెల 26న పోలింగ్ జరగనుండగా.. ఈనెల 30వ తేదీన ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఈనెల 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు.
ఎన్నికలు జరిగే స్థానాలివే..
♦ శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
♦ ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా), రాజాం (విజయనగరం), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు (పశ్చిమగోదావరి), చింతలపూడి (ఏలూరు), గుడివాడ, తాడిగడప (కృష్ణా), పొన్నూరు (గుంటూరు), నరసరావుపేట (పల్నాడు), కందుకూరు (ప్రకాశం), పొదిలి (మార్కాపురం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), శ్రీకాళహస్తి (తిరుపతి), బి.కొత్తకోట (అన్నమయ్య), బాపట్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
