కరోనా శానిటైజేషన్ పనులే ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణమన్న నిపుణులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 10:06 PM IST
కరోనా శానిటైజేషన్ పనులే ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణమన్న నిపుణులు

Updated On : December 10, 2020 / 7:24 AM IST

Eluru ‘mystery’ illness ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఏలూరులో 550 మందిని పైగా ప్రభావితం చేసిన అంతుచిక్కని వ్యాధిపై దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ -19 పారిశుధ్య చర్యలలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ మరియు క్లోరిన్ అధికంగా వాడటం వల్ల నీటి కాలుష్యం సంభవించి ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని చెప్పారు.



కోవిడ్ -19 నివారణ చర్యలలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలలో బ్లీచింగ్ పౌడర్ మరియు క్లోరిన్ అధికంగా వాడటమే నీటి కలుషితానికి కారణమని ఆరోగ్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇది మేము అన్వేషిస్తున్న కారణాలలో ఒకటి అని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు.



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి కాలుష్యానికి మూలంపై దర్యాప్తు చేయడంపై ఫోకస్ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎయిమ్స్ (న్యూ ఢిల్లీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్, సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నిపుణుల బృందం సూచించింది.



కాగా, ప్రస్తుతం అంతుచిక్కని వ్యాధి బారినపడ్డ రోగుల శరీరాల్లో సీసం మరియు నికెల్ ఉండటం అనారోగ్యానికి కారణం కావచ్చు, ఏలూరులో వాటర్ సప్లైలో(నీటి సరఫరా) కలిపిన పురుగుమందులను అధికంగా వాడటం వల్ల ఇది జరిగి ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.



ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, నిపుణులు ఈ ఘటనపై మాట్లాడుతూ… గడిచిన మూడు రోజులుగా ఏలూరులో అనారోగ్యంతో బాధపడుతున్న వారి రక్తంలో సీసం మరియు నికెల్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. అలాగే, అనారోగ్యానికి గురైన 24 గంటల తర్వాత రోగుల శరీరాల్లో సీసాల స్థాయిలో గణనీయమైన తగ్గుదల ఉందని కనుగొనబడిందని తెలిపారు. నీటి వనరులలో విరిగిన బ్యాటరీలను డంప్ చేయడం ప్రస్తుత పరిస్థితికి దారితీసి ఉండవచ్చని ఒక అధికారి తెలిపారు



బాధిత వ్యక్తుల తొలి రక్త నమూనాలను తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ నిపుణులు మాట్లాడుతూ… పురుగుమందులు తాగునీటి వనరులను కలుషితం చేసి ఉండవచ్చని చెప్పారు. అనారోగ్యం బారినపడ్డ కుటుంబాల నుండి ఆహారం, నీరు, పాలు, మూత్రం మరియు రక్త నమూనాలను తాము పరిశీలించామని మరియు మార్కెట్ నుండి కూరగాయలు మరియు నిత్యావసరాల నమూనాలను కూడా తీసుకున్నట్లు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిపుణుల బృందం తెలిపింది.

తాము సమగ్ర పరీక్షలు నిర్వహిస్తున్నామని. ఇప్పటివరకు, ఎలాంటి ప్రమాద సంకేతాలు లేవని.. నీరు, ఆహారం, పాలు, మూత్రం మరియు రక్త నమూనాలపై తాము ఒక నివేదికను సమర్పిస్తామని NIN బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జె జె బాబు చెప్పారు.