PRC Report : ఏపీలో పీఆర్సీ రగడ.. నివేదిక బహిర్గతం చేయబోమన్న ప్రభుత్వం

ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది.

employees demand for release of the PRC report : ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది. పీఆర్సీ నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ నేతలు డిమాండ్‌ చేయగా.. సర్కార్‌ మాత్రం నో చెప్పింది. సాంకేతిక అంశాల్ని అధ్యయనం చేయాల్సి ఉందన్న అధికారులు.. పీఆర్సీ నివేదిక బయటకు చెప్పేది లేదన్నారు.

పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో సర్కార్‌ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ రిపోర్ట్‌ ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

Google : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తితో గూగుల్ కీలక నిర్ణయం

మరోవైపు పీఆర్సీ రగడ తీవ్రంగా మారుతున్న తరుణంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్ని సీఎం జగన్‌ పరిశీలిస్తుండగా.. ఉద్యోగులు వెళ్లి ఆయన్ను కలిశారు. పీఆర్సీ నివేదిక అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దాదాపుగా పూర్తయిందని జగన్ చెప్పారు.

అయితే సీఎం జగన్‌ చెప్పాక కూడా పీఆర్సీ నివేదిక బయటపెట్టకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు. ముందుగా ప్రకటించినట్లే ఈనెల 7 నుంచి నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు