Google : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తితో గూగుల్ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తితో.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్న్‌ టు ఆఫీస్‌ ప్లాన్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

Google : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తితో గూగుల్ కీలక నిర్ణయం

Google

Google key decision : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తితో.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్న్‌ టు ఆఫీస్‌ ప్లాన్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ప్రారంభం కానున్న రిటర్న్‌ టు ఆఫీస్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

మరోవైపు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకూ ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించింది. చాలా దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్‌ విస్తరించినప్పటికీ.. ఒమిక్రాన్‌తో మరణం సంభవించినట్లు ఏ దేశంలోనూ నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళకర రకంగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో.. వైరస్‌ తీవ్రతకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది.

PM Modi Uttarakhand Tour : నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన..ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 30 దేశాలకు వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ వేరియంట్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైరస్‌ తీవ్రతకు సంబంధించిన అదనపు సమాచారం వస్తుంది. ఈ సమయంలో కొన్నిచోట్ల మరణాలకు సంబంధించిన సమాచారం కూడా రావచ్చని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక సమాచారం బట్టి ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంక్రమణ సామర్థ్యం అధికంగా ఉందని పేర్కొంది.

ఇక రానున్న రోజుల్లో ఒమిక్రాన్‌ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రాబల్యమే అధికంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించిన విధంగానే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు కట్టడి చర్యలు అమలు చేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది.