Kottu Satyanarayana : టీడీపీ, బీజేపీకి మత రాజకీయాలు అలవాటు- మంత్రి కొట్టు సత్యనారాయణ
దేవాలయాల పరిరక్షణ మాకు అత్యంత ముఖ్యం అన్నారు. అన్ని ఆలయాల్లో భద్రత పటిష్టం చేస్తామన్నారు. ఆలయాల భూములు..(Kottu Satyanarayana)

Kottu Satyanarayana
Kottu Satyanarayana : దేవాదాయశాఖ మంత్రిగా తనను నియమించడం అదృష్టంగా భావిస్తున్నా అని కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవుడికి సేవ చేసే భాగ్యాన్ని సీఎం జగన్ తనకు కల్పించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖలో అనేక సమస్యలు ఉన్న మాట వాస్తవమే అన్న కొట్టు సత్యనారాయణ, వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. దేవాలయాల పరిరక్షణ మాకు అత్యంత ముఖ్యం అన్నారు. అన్ని ఆలయాల్లో భద్రత పటిష్టం చేస్తామన్నారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి కృషి చేస్తానని మంత్రి కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. దేవాలయాల చుట్టూ వచ్చే వివాదాలు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ది కోసం సృష్టించేవే అని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీకి మత రాజకీయాలు చెయ్యడమే అలవాటు అని ధ్వజమెత్తారు. ఉనికి కోసమే దేవాలయాలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.(Kottu Satyanarayana)
AP Cabinet: శాఖలు ఖరారు.. ఐదుగురికి డిప్యూటీ సీఎంగా చాన్స్.. హోం మంత్రిగా తానేటి వనిత..!
ఏపీలో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి కూడా ఐదుగరు డిప్యూటీ సీఎంలను నియమించారు. అలాగే హోంమంత్రి పదవి దళిత మహిళకు దక్కింది. డిప్యూటీ సీఎంలుగా నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, ముత్యాల నాయుడు, రాజన్న దొరకు పదవులు దక్కాయి. హోంమంత్రిగా తానేటి వనితకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్.(Kottu Satyanarayana)
మంత్రులకు కేటాయించిన శాఖలు..
1. ధర్మాన ప్రసాద రావు: రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
2. సీదిరి అప్పల రాజు: మత్స్య, పశుసంవర్థకశాఖ
3. బొత్స సత్యనారాయణ: విద్యా శాఖ
4. పీడిక రాజన్న దొర: గిరిజన సంక్షేమ శాఖ.
5. గుడివాడ అమర్నాథ్: పరిశ్రమలు, ఐటీ శాఖ
6. బూడి ముత్యాల నాయుడు: పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్ మెంట్
7. దాడి శెట్టి రాజా: రోడ్లు, భవనాలు
8. పినిపె విశ్వరూప్: రవాణా శాఖ (Kottu Satyanarayana)
9. చెల్లుబోయిన వేణు: బీసీ సంక్షేమం, సమాచారం, సినిమాటోగ్రఫీ
10. తానేటి వనిత: హోం శాఖ , విపత్తుల నిర్వహణ
11. కారుమూరి నాగేశ్వరరావు: పౌర సరఫరాల శాఖ
12. కొట్టు సత్యనారాయణ: దేవాదాయ శాఖ
13. జోగి రమేష్: గృహ నిర్మాణ శాఖ
14. మేరుగ నాగార్జున: సాంఘిక సంక్షేమ శాఖ (Kottu Satyanarayana)
15. విడదల రజినీ: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
16. అంబటి రాంబాబు: జల వనరుల శాఖ
17. ఆదిమూలపు సురేష్: పురపాలక శాఖ
18. కాకాణి గోవర్ధన్ రెడ్డి: వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: విద్యుత్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
20. ఆర్కే రోజా: టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు
21. కె.నారాయణ స్వామి: ఎక్సైజ్ శాఖ
22. అంజాద్ బాషా: మైనార్టీ శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్ధిక, శాసనసభావ్యవహారాలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ, వాణిజ్య పన్నులు
24. గుమ్మనూరు జయరామ్: కార్మిక శాఖ
25. ఉష శ్రీ చరణ్: స్త్రీ శిశు సంక్షేమ శాఖ
Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి