Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ లో తాజా మంత్రివర్గ కూర్పు అధికార వైకాపాలో అసంతృప్తి సెగలు రేపింది. గతంలో కనిపించని విధంగా పార్టీలో చిచ్చు రేపింది. మంత్రి పదవులు ఆశించి తక్కని వారు ఒక్కసారిగా డీలా పడ్డారు. దీంతో వైకాపా అధిష్టానం తీరుపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తపరిచారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి నేతలు తమను మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా..పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు అలకబూనినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా..బాలినేని సైతం రాజీనామాకు సిద్ధమైనట్లు తెల్సింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటులేకపోవడంపై..ఆయా నేతల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒంగోలులో బాలినేని అనుచరులు రాస్తారోఖోలు, నిరనసన కార్యక్రమాలు చేపట్టగా..మాచర్లలో పిన్నెల్లి వర్గీయులు రోడ్లపై వాహనాలు దగ్ధం చేశారు. ఇక మంత్రి పదవి దక్కకపోవడంపై అలకబూనిన నేతలను అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం సజ్జల రామకృష్ణ రెడ్డి..ఆయా నేతలను కలిసి పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు.

Also Read:Nagari MLA Roja : జగన్ చేతిని ముద్దాడిన రోజా

ఈక్రమంలో 10టీవీతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి..మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని అన్నారు. మంత్రి పదవి కొనసాగకపోవడంతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఆవేదన చెందారని..కొందరిని మంత్రివర్గంలోనికి తీసుకొని తనును తీసుకొనకపోవడంతో తానే తక్కువస్థాయి నేతగా మేకతోటి సుచరిత ఫీలయినట్లు ఉన్నారని సజ్జల అన్నారు. మేకతోటి సుచరిత రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా తాను వైసీపీలోనే కొనసాగుతానని మేకతోటి సుచరిత స్పష్టం చేసినట్లు ఆయన వివరించారు. సీఎం జగన్ తో చర్చించిన అనంతరం మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి తొలగిపోతుందని సజ్జల వివరించారు. ఇక మంత్రివర్గ కూర్పుపై ఎవ్వరిలో అసంతృప్తి లేదని..అంతా సమసిపోతుందని ఆయన అన్నారు.

Also read:Peddireddy Ramachandra Reddy : అనుభవంలోనూ,వయస్సులోనూ పెద్దాయనే పెద్దిరెడ్డి