జగనే సీఎం కావాలి.. లేదంటే పెన్షన్ల కోసం మళ్లీ చేతులు కట్టుకోవాల్సి వస్తుంది- అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరిక
ఇలాంటి సీఎంను ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాలన ఏ సీఎం అయినా అందించారా?

Anil Kumar Yadav (Photo : Google)
Anil Kumar Yadav : సీఎం జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్. సామాజిక సాధికారతకు సీఎం జగన్ చేసిన కృషి ఏ ఒక్కరు చెయ్యలేదని ఆయన అన్నారు. దేశంలో ఏ సీఎం చెయ్యని విధంగా సమానత్వం కోసం జగన్ కృషి చేశారని కితాబిచ్చారు. పేదల గౌరవం పెంచిన వ్యక్తి వైఎస్ జగన్ అని పొగిడారు. రాయచోటిలో సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
పెన్షన్ల కోసం గతంలో చేతులు కట్టుకుని నిలబడే వాళ్లని, కానీ ఈ ప్రభుత్వ హయంలో అలాంటి పరిస్దితి లేదని అనిల్ కుమార్ అన్నావ్ అన్నారు. సీఎం జగన్ పాలనలో నేరుగా ఇంటికే పెన్షన్లు పంపుతున్నారని చెప్పారు. ఇలాంటి పాలన ఏ సీఎం అయినా అందించారా? అని ఆయన అడిగారు. ఇలాంటి సీఎంను ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే మళ్లీ వెనక్కి వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. పెన్షన్ల కోసం మళ్లీ చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్
2024లో మనం నొక్కే బటన్ తో మళ్లీ వైసీపీ గెలవాలని అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మేము పనికి రాని వాళ్లను తీసేస్తే వారిని ఏరుకొనే పనికిమాలిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఏరుకొనే పార్టీ గొప్పదా? వైసీపీ గొప్పదా? అని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పచ్చ మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ ను ఏమీ చేయలేర అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాయలసీమ పౌరుషానికి.. పప్పు, పులకేసికి మధ్య పోటీ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?