Perni Nani : ఎన్టీఆర్ టెక్కలి వెళ్ళలేదా? మోదీ వారణాసికి మారలేదా? హిందూపురం బాలకృష్ణ సొంతూరా? చంద్రబాబుపై పేర్నినాని ఫైర్

కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.

Perni Nani Slams Chandrababu And Pawan Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి పేర్నినాని. వైసీపీలో ఎమ్మెల్యే స్థానాల మార్పుపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు పేర్నినాని. రాజకీయాల్లో అభ్యర్థుల మార్పు కామన్ అన్నారాయన. మోదీ గుజరాత్ నుండి వారణాసి వెళ్ళలేదా? చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పంకు మారలేదా? లోకేశ్ మంగళగిరి వెళ్లలేదా? పవన్ గాజువాక వెళ్లలేదా? ఎన్టీఆర్ టెక్కలి వెళ్ళలేదా? హిందూపురం బాలకృష్ణ సొంతూరా? వీళ్ళంతా ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు? అని చంద్రబాబును నిలదీశారు పేర్నినాని. సీఎం జగన్ నిర్ణయంతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు వల్ల కాదన్నారు.

లోకేశ్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా విరుచుకుపడ్డారు పేర్నినాని. ”లోకేశ్ ది పాదయాత్ర కాదు. జంపింగ్ జపాంగ్ యాత్ర. జంప్ లు చేసుకుంటూ వెళ్లారు. మొదలు పెట్టింది యువగళం. ముగించింది నవశకం. లోకేశ్ పాదయాత్ర అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో జరిగింది. పాదయాత్ర కిలోమీటర్లు అంటున్నారు. అంతా దొంగ లెక్కలు. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ సినిమా.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది

బతిమాలి, బేరమాడి పవన్ కల్యాణ్ ని సభకు తెచ్చుకున్నారు. 2014లో ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెబుతున్నారు. చంద్రబాబు 600 హామీల మోసంలో పవన్ కల్యాణ్ వాటా కూడా ఉంది. 2019లో ఖబడ్దార్ లోకేశ్ అన్న పవన్.. లోకేశ్ మీటింగ్ కి ఎందుకు వెళ్ళాడు? లోకేశ్ మీ తల్లిని దుషించాడు అన్నావ్. క్షమాపణ చెప్పాడా..?

కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు. హరిరామ జోగయ్య లాంటి అమాయకులు అర్థం చేసుకోవాలి. మా నాన్న సమర్థుడు. ఆయనే సీఎం అభ్యర్థి అని లోకేశ్ అంటున్నాడు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబే సీఎం అభ్యర్థి అంటున్నాడు. 150 సీట్లలో టీడీపీ, 25 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. 25 సీట్లలో సగం మేమే ఇవ్వాలని లోకేశ్ చెబుతున్నాడట. పవన్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం. 2014 నుండి అదే ప్రయత్నం చేస్తున్నాడు” అని పేర్నినాని అన్నారు.

Also Read : వైసీపీలో కీలకంగా మారిన మిథున్ రెడ్డి.. ఆ భారమంతా ఈయనపైనే మోపిన జగన్