Kurnool
Kurnool Dist : కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాదం నెలకొంది. సుంకేసులలో పీర్ల పండుగను పురస్కరించుకొని అగ్ని గుండం వెలిగించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే ప్రమాదవశాతు అగ్నిగుండంలో పడిన వ్యక్తి సజీవదహనమయ్యాడు. స్థానికులు అతడిని రక్షించే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
Read More : Sugar BP Test : బీపీ, షుగర్ టెస్ట్‌లు ఇంటివద్దే
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పీర్ల పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు. అలాగే…సుంకేసులలో పెద్ద సరిగేతు పండుగను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. కాశిపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కూడా పీర్ల పండుగను చూసేందుకు వచ్చాడు. అయితే అగ్ని గుండం వెలిగించిన సమయంలో.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. స్థానికులు వెంటనే కర్రల సాయంతో అతడిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆలస్యం కావడంతో సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని మృతదేహాన్ని బయటికి తీశారు.
Read More : Vijayawada : రాహుల్‌ను చంపేశారు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ?
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా మొహర్రంను జరుపుకుంటుంటారు. అప్పటి యజీద్ చక్రవర్తి చేసిన దారుణాలు, దురాగతాలు, దౌర్జన్యాలపై ఇమామ్ హుస్సేన్ పోరాడారు. కర్బలా మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం చేశాడు. ఇమాం హుస్సేన్ తో పాటు అతని కుటుంబసభ్యులందరికీ మొహర్రం నెలలో పది రోజుల పాటు నివాళులర్పిస్తారు. పది రోజుల పాటు పీర్లను ఊరేగించి..నిమజ్జనం చేస్తారు.