Vijayawada : రాహుల్‌‌ను చంపేశారు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ?

విజయవాడ నడిబొడ్డున కారులో దారుణ హత్యకు గురైన రాహుల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాహుల్‌ది హత్యేనని నిర్ధారించారు.

Vijayawada : రాహుల్‌‌ను చంపేశారు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ?

Vijayawada Rahul Killed

Updated On : August 20, 2021 / 7:17 AM IST

Vijayawada Rahul : కారులో మృతదేహం కేసు కీలక మలుపు తిరిగింది. వ్యాపారి రాహుల్‌ను హత్య చేసినట్టు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాహుల్ కారులో తాడు, తలదిండు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు… ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. గంటలో వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన రాహుల్‌ ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? ఎవరితో ఫోన్‌ మాట్లాడాడు? అనే విషయాలపై పోలీసులు దృష్టిపెట్టారు.

Read More : Sravana Sukravaram : శ్రావణ శుక్రవారాలు… ఎందుకంత ప్రత్యేకత…!

విజయవాడ నడిబొడ్డున కారులో దారుణ హత్యకు గురైన రాహుల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాహుల్‌ది హత్యేనని నిర్ధారించారు. ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రాహుల్‌ హత్యలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ఉన్నట్టు గుర్తించారు. బుధవారం రాత్రి కారులో మూడు గంటల పాటు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు తేల్చారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Read More : Princepal Singh : NBA టైటిల్ గెలిచిన టీమ్‌లో తొలి భారతీయుడిగా ప్రిన్సిపాల్ సింగ్

రాహుల్ కారులో తాడు, తలదిండును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మెడ కిందిభాగంలో ఒరుసుకుపోయినట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. దిండుతో ముఖంపై అదిపి, తాడుతో గొంతు నులిమి రాహుల్‌ను హత్య చేసినట్టు నిర్ధారించారు బెజవాడ పోలీసులు. రాహుల్ హత్యకు ఆర్థిక విబేధాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. గంటలో వస్తానంటూ బుధవారం రాత్రి ఏడున్నరకు ఇంటి నుంచి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. విజయవాడలోని డీవీమేనర్ రోడ్‌లో కారులో డెడ్ బాడీ ఉందనే సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. కారు షోరూం నుంచి మెకానిక్‌లను రప్పించి కారు డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి తెరుకోలేదు. దీంతో కారు అద్దం పగులగొట్టి అతి కష్టం మీద కారు డోర్స్‌ని ఓపెన్‌ చేశారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అయితే స్పెషల్ టీమ్‌తో టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read More : Afghanistan : తాలిబన్ కి అమెరికా మరో బిగ్ షాక్..ఆయుధాల అమ్మకాలు నిలిపివేత

తమ అల్లుడికి వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి మనస్పర్థలు లేవని, ఎవరితోనూ విబేధాలు లేవని అతని మామ గట్టు మాణిక్యాలరావు చెప్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. రాహుల్‌కు జి కొండూరులో జిక్సన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉంది. అందులో ఎంత మంది పార్ట్‌నర్స్‌ ఉన్నారు.. వారితో ఏమైనా విభేధాలు ఉన్నాయా.. అనే విషయంపై ఇప్పుడు పోలీసులు దృష్టిపెట్టారు. కెనడాలో ఎంఎస్ చేసిన రాహుల్‌ మూడేళ్లక్రితం విజయవాడకు వచ్చి గ్యాస్‌ కంపెనీ ప్రారంభించాడు. ఇటీవల ఒంగోలులో కూడా ఓ కంపెనీకి శంకుస్థాపన చేశారు. దీంతో కొత్త కంపెనీ విషయంలో వ్యాపార లావాదేవీల్లో ఏమైనా తేడాలు వచ్చాయా.. అనే దానిపై దృష్టి సారించారు. అయితే ఇప్పటికే కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.