Sugar BP Test : బీపీ, షుగర్ టెస్ట్‌లు ఇంటివద్దే

తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటివద్దనే షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించనుంది.

Sugar BP Test : బీపీ, షుగర్ టెస్ట్‌లు ఇంటివద్దే

Sugar Bp Test

Sugar BP Test : రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనుంది. ఫైలెట్ ప్రాజెక్టులుగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్ల ఎంచుకోనున్నారు. గురువారం ఐటీ మంత్రి కేటీఆర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో దీనిపై చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని తెలిపారు. బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అకడికకడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమనుకుంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్లకు పంపి, పరీక్షలు చేయిస్తారని వివరించారు.

ఇందుకు ప్రాథమిక కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చుతామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే వైద్యారోగ్యశాఖ భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.