Chandrababu : ఫైబర్ నెట్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు రాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడింది.

Chandrababu : ఫైబర్ నెట్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu (1)

Updated On : December 12, 2023 / 11:59 AM IST

Chandrababu Anticipatory Bail Petition : ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు రాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడింది.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.

Minister Komatireddy : ఢిల్లీలో సకల సౌకర్యాలతో తెలంగాణ భవన్ నిర్మాణం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి

ఇన్నర్ రింగ్ కేసుతోపాటు ఇసుక కుంభకోణం కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు.