Fire breaks out in a lorry: గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు.. పేలిపోయిన 100కి పైగా సిలిండర్లు

గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగడంతో అందులోని 100కి పైగా సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద చోటుచేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి దాటాక 300కి పైగా సిలిండర్లతో ఉన్న లారీ వెళుతోంది. అది కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళ్ళాల్సి ఉంది. ఆ భారత్‌ గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

Fire breaks out in a lorry: గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు.. పేలిపోయిన 100కి పైగా సిలిండర్లు

Fire breaks out in a lorry

Updated On : September 2, 2022 / 12:05 PM IST

Fire breaks out in a lorry: గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగడంతో అందులోని 100కి పైగా సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద చోటుచేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి దాటాక 300కి పైగా సిలిండర్లతో ఉన్న లారీ వెళుతోంది. అది కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళ్ళాల్సి ఉంది. ఆ భారత్‌ గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్‌ లారీని ఆపి పక్కకు వెళ్ళారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని జాతీయ రహదారిపై ఇరు వైపులా అర కిలోమీటరు దూరంలో వాహనాలను నిలిపేశారు. అనంతరం లారీలోని సిలిండర్లు పేలాయి. సిలిండర్లు పేలుతుండడంతో ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడలో దాదాపు 30 ఇళ్ళను అధికారులు ఖాళీ చేయించారు. ఫైరింజన్ల ద్వారా 200 మీటర్ల దూరం నుంచే మంటలు ఆర్పేందుకు యత్నించారు.

China-Taiwan conflict: చైనా డ్రోనును తొలిసారి కుప్పకూల్చిన తైవాన్.. తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన