Mosquito Coil : దోమల నివారణ కోసం మస్కిటో కాయిల్స్ వాడటం సర్వ సాధారణం. రాత్రి పూట పడుకునే సమయంలో దోమల బారి నుంచి తప్పించుకోవడానికి దోమల చుట్ట వాడతారు. మస్కిటో కాయిల్ ను వెలిగించి నిద్రపోతారు. ఆ చుట్ట నుంచి వచ్చే పొగతో దోమలు ఆ చుట్టపక్కల రాకుండా ఉంటాయి. దాంతో హాయిగా నిద్రపోవచ్చంటారు.
అయితే, కొన్నిసార్లు దోమల చుట్టలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఘోర అగ్నిప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో అలాంటి ప్రమాదమే జరిగింది. అక్కడ మస్కిటో కాయిల్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దోమల నివారణ కోసం కాయిల్ ను ముట్టించగా.. ప్రమాదశాత్తు మంటలు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో 20 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మండవల్లి మండలం భైరవపట్నంలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదంతో గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.
మస్కిటో కాయిల్స్ వినియోగం పట్ల చాలా కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం. కాయిల్ ని వెలిగించాక అది మండుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది ఘోర ప్రమాదాలకు దారితీస్తోంది. ఎలాంటి ప్రమాదం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేఫ్ ప్లేస్ లో దోమల చుట్టను ఉంచాలి. దీని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఇష్టానుసారంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక,
ఇక, ఆ చుట్ట నుంచి వెలువడే పొగ కూడా మనిషికి ప్రాణాంతకం అనే చెప్పాలి. శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వారు మరింత అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఆ చుట్ట నుంచి వచ్చే పొగ దోమలను తరిమేయడం ఏమో కానీ, మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ సేపు ఆ పొగను పీలిస్తే హెల్త్ కు మంచిది కాదని డాక్టర్లు చెబుతారు.
Also Read : ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్