Andhra Pradesh : ఈ మంత్రికి వర్షాలకు అకాల వర్షాలకు తేడా తెలియదు ఇదేం ఖర్మరా బాబూ : సోమిరెడ్డి
వర్షాలకు, అకాల వర్షాలకు తేడా తెలియనివాళ్లు మంత్రిగా ఉంటే ఇలాగే ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండటం మన ఖర్మ. వ్యవసాయ మంత్రికి వర్షాలకు అకాల వర్షాలకు తేడా తెలియదు అంటూ సెటైర్లు వేశారు.

somireddy..kakani
Andhra Pradesh : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy)పై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy)సెటైర్లు వేశారు. మంత్రి కాకాణి మంత్రిగా ఉండటం మన ఖర్మ ఈ మంత్రికి వర్షాలకు, అకాల వర్షాలకు తేడాయే తెలియదు ఇదేం ఖర్మరా బాబూ అంటూ సెటైర్లు వేశారు. ఇటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండటం మన ఖర్మ అన్నారు. విమర్శిస్తే నోరు పారేసుకోవటం తప్ప ఇంకేమీ తెలియని కాకాణి మంత్రిగా ఉండటం మన ఖర్మ అని అన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న కాకాణి వర్షాలు, పంటల నష్టాలపై సమీక్షలు చేయటంలేదంటూ విమర్శించారు.
సమీక్షలు చేయటం ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎంత నష్టపోయారు? అనేదానిపై సమీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు? అంటూ విమర్శించారు. ఇరిగేషన్, అగ్రికల్చర్ ఖాలను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది అంటూ ఆరోపించారు. రైతులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..అన్ని రాష్ట్రాల రైతుల గురించి ఆలోచిస్తుంటే ఏపీ మాత్రం వెనుకబడిపోయి ఉందన్నారు.
కాగా మంత్రి కాకాణి, సోమిరెడ్డి మధ్య వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ దేశాల్లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు పెద్ద ఎత్తున వివాదంగా మారాయి. మీడియా సమావేశంలో కొన్ని పత్రాలు కూడా చూపించి సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ పత్రాలు నకిలీవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు తేల్చి చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు.
ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో పోలీసులు కొందరిని అరెస్టు చేయటం..విచారణ చేయటం వంటి పలు కీలక ఘటనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చాగా ఏకంగా కోర్టులో భదర్రపచ్చిన ఆధారాలు చోరీకి గురయ్యాయి.ఈ చోరీ చేయించింది కాకాణియేనని అతనికే ఆ అవసరం ఉందని సోమిరెడ్డి ఆరోపించటం వంటి పలు కీలక సందర్భాలు వీరిద్దరి మధ్యా కొనసాగుతున్నాయి.